సిరిసిల్ల ను దేశంలోనే అగ్రశ్రేణి నియోజవర్గంగా తీర్చిదిద్దుతా

అన్ని పట్టణాలలో సమీకృత రైతు బజార్ లను నిర్మిస్తాం:


త్వరలోనే తెలంగాణలో రెండో హరిత విప్లవం ఆవిష్కృతం


రైతు బజార్ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి కే తారకరామారావు



రాజన్న సిరిసిల్ల, ఆ దేశంలోనే ఎంత రాజన్న సిరిసిల్ల : తనకు రాజకీయ జన్మనిచ్చిన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మంత్రి శ్రీ కే తారకరామారావు తెలిపారు. సిరిసిల్ల పట్టణం మాదిరే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పట్టణాలను అభివృద్ధి చేస్తానని మంత్రి పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి శ్రీ కే తారకరామారావు సిరిసిల్ల పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థానలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.5.15కోట్ల తో సిరిసిల్ల పట్టణంలో నిర్మించిన అధునాతన రైతు బజార్ ను మంత్రి ప్రారంభించారు. మార్కెట్ లో రైతులు, వ్యాపారులతో ముచ్చటించారు. అనంతరం నెహ్రూ నగర్ లో మానే రు వాగు పై రూ.12 కోట్లతో నిర్మించనున్న చెక్ డ్యాం కు శంకుస్థాపన చేశారు. ఆ వెంటనే గణేష్ నగర్ లో రూ.41 లక్షల తో నిర్మించిన పార్క్ కు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా రైతు బజార్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రమైన కరీంనగర్ నగరం తో పాటు ఇతర పట్టణాలు సైతం స్పూర్తిగా తీసుకునేలా సిరిసిల్ల పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అని మంత్రి తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో నిర్మించిన రైతు బజార్ స్ఫూర్తిగా తెలంగాణలోని ప్రతి పట్టణంలో సమీకృత రైతుబజార్ ను నిర్మిస్తామని మంత్రి శ్రీ కే తారక రామారావు తెలిపారు. తన సిరిసిల్ల నియోజకవర్గం తో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మంత్రి పేర్కొన్నారు. రైతుబంధు ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతి రోజూ 24 గంటల్లో 18 గంటల పాటు రైతుల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారని తెలిపారు.


సింగిల్విండో చైర్మన్ గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాటి నుండి నేటి వరకు రైతుల గురించి వారి సంక్షేమ అభివృద్ధి గురించే ఆరాటపడుతున్నారని ఆయన గుర్తు చేశారు. కాలంతో పోటీ పడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను మూడేండ్లలో పూర్తి చేయడం సీఎం కేసీఆర్ పనితీరుకు అద్దం పడుతుందన్నారు. రోహిణి కార్తెలో కూడా చెరువులు నింపడం సీఎం కేసీఆర్ పనితనానికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రైతుబంధు, రైతుబీమా అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. సంక్షోభ సమయంలోనూ ఒక్క రోజులోనే 52 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అయ్యాయని పేర్కొన్నారు. ఈ ఏడాది రూ. 25 వేల లోపు రుణాలు ఉన్న రైతుల రుణమాఫీ ఒకేసారి అమలు చేశామని వెల్లడించారు. వ్యవసాయ రంగానికి మహర్గ దశ పట్టనుందని, విదేశాలకు చేపలు, రొయ్యలు ంత్రి ఎగుమతి చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. రైతును రాజును చేయడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. వ్యాపారులు మార్కెట్ లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. తెలంగాణలో త్వరలోనే రెండో విడత హరితవిప్లవం ఆవిష్కృతం కానుంది అని మంత్రి పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో లో చేరి పట్టిన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఏర్పడిన జల విప్లవం పునాదిగా మరో నాలుగు విప్లవాలకు ఆవిష్కృతం కానున్నాయని మంత్రి తెలిపారు.నీలి విప్లవం గులాబీ శ్వేత విప్లవం హరిత విప్లవం లకు తెలంగాణ కేంద్రబిందువు కానుందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి సౌకర్యం గణనీయంగా మెరుగు పడడంతో వ్యవసాయ పంట ఉత్పత్తులు అనేక రెట్లు పెరగనున్నాయని మంత్రి తెలిపారు. పెరిగే వ్యవసాయ ఉత్పత్తులను నిల్వచేసేందుకు పెద్దఎత్తున ఆధునిక వ్యవసాయ గోదాములను నిర్మించామని మంత్రి తెలిపారు. అంతేకాకుండా వ్యవసాయ ఉత్పత్తులకు విలువ పెంచేందుకు స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ కూడా సేవల్ పుడ్ పాసెసింగ్ కూడా ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని పేర్కొన్నారు. ముఖ్యమ ంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆలోచన ఒక్కటే నని.... అదే రైతులందరూ బాగుపడాలని అదే తన ఆశయమని తెలిపారు..


రైతుల క్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వం నియంత్రిత పంటల సాగుకు శ్రీకారం చుట్టిందని మంత్రి పేర్కొన్నారు. రైతు శ్రేయస్సే పరమావధిగా ప్రభుత్వం చేపడుతున్న నియంత్రిత పంటల సాగు విధానం పై దుష్పచారం ను స్థానిక ప్రజా ప్రతినిధులు తిప్పికొట్టాలని మంత్రి శ్రీ కే తారక రామారావు పిలుపు నిచ్చారు. జిల్లాలో రైతులకు గత వానాకాలం పంట సమయంలో 1,03,153 మంది కి రైతుబంధు క్రింద 121 కోట్ల పంట పెట్టుబడి సహాయం రాగా, ప్రస్తుత వానకాలం లో ఒక లక్ష 12 వేల767 మందికి రైతుబంధు క్రింద 128 కోట్ల పంట పెట్టుబడి సహాయం అందిందని మంత్రి తెలిపారు. అంటే గతంతో పోల్చుకుంటే 8567మంది రైతులకు కొత్తగా రైతు బంధు అందుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ విషయాన్ని రైతుల తీసుకెళ్లాలని మంత్రి ప్రజాప్రతినిధులకు సూచించారు. నియంత్రిత పంటల సాగు విధానంలోడిమాండ్ ఉన్న, అక్కర కొచ్చే పంటలను సాగు చేయడం వల్ల రైతులకు ఆర్థిక ప్రయోజనం ఉంటుందన్నారు. దేశం కోసం పోరాటం చేస్తూ చైనా సరిహద్దు లలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి కి ప్రభుత్వం అన్ని విధాలుగా వెన్నుదన్నుగా నిలిచిందని మంత్రి తెలిపారు. స్వయంగా ముఖ్యమంత్రి వారి ఇంటికి వెళ్లి 5 కోట్ల ఆర్థిక సహాయం తో పాటు, ఉద్యోగ ఉత్తర్వులు హైదరాబాద్ లో స్థలం సంబంధించిన పత్రాలను వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన సహాయం ను ప్రతి పక్షాల నేతలు అభినందించారని పేర్కొన్నారు. తేస్కా బ్ చైర్మన్ శ్రీ కొండూరీ రవీందర్రావు మాట్లాడుతూ ఆర్థికంగా గడ్డుకాలం నడుస్తున్నప్పటికీ ప్రభుత్వం రైతుల శ్రేయస్సును కాంక్షించి రైతు బంధును విడుదల చేసిందని తెలిపారు. ప్రభుత్వం అందించిన పెట్టుబడి సహాయం ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే కే.శివ పట్టణంలో ప్రభుత్వం నిర్మించిన సమీకృత రైతు బజార్ రైతులకు వినియోగదారులకు ఇద్దరికి ప్రయోజనకరంగా ఉంటుంది అన్నారు. రైతులకు తాము పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఎన్. అరుణ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందని పేర్కొన్నారు.


పంట విత్తే దశనుంచి, విక్రయించే దశ వరకు రైతన్నకు అన్ని విధాలుగా వెన్నుదన్నుగా ప్రభుత్వం నిలుస్తుందన్నారు. జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు శ్రీ గడ్డం నర్సయ్య మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి జరుగుతుందని దీనికంతటికీ కారణం మంత్రి కే తారకరామారావు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడమే ప్రధాన కారణమన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో సకాలంలో రైతుబంధు పంట పెట్టుబడి సహాయం జమ చేయడం రైతుల పట్ల వారి సంక్షేమం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి కి నిదర్శనమని ఆయన అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ ఆకునూరీ శంకరయ్య, సెస్ చైర్మన్ శ్రీ దోర్నాల ల లక్ష్మారెడ్డి ట్రైనీ కలెక్టర్ శ్రీ రిజ్వాన్ బాషా షేక్, క ఆర్ డి ఓ శ్రీ టి శ్రీనివాస్ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి జిందం కళ, ఏ ఏం సి చైర్మన్ శ్రీమతి లింగం రాణి, మున్సిపల్ కమిషనర్ శ్రీ సమ్మయ్య, జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీ షాబుద్దీన్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ రణధీర్ రెడ్డి, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీ ఖదీర్ అహ్మద్, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. రైతు బజార్ ను వేగంగా నిర్మించారు. ట్విట్టర్ వేదికగా కలెక్టర్ ను అభినందించిన మంత్రి శ్రీ కే తారకరామారావుసిరిసిల్ల పట్టణంలో సమీకృత రైతు బజార్ త్వరితగతిన పూర్తి చేసేందుకు జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్ ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి కే తారకరామారావు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. త్వరితగతిన ప్రారంభోత్సవం చేసిన జిల్లా కలెక్టర్ కు అభినందనలు అంటూ ట్విట్టర్ వేదికగా మంత్రి తారక రామారావు మంగళవారం పోస్ట్ చేశారు. స్పందించిన జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్ మంత్రి శ్రీ కె తారక రామారావు సంపూర్ణ సహకారం,మార్గ దర్శనం వల్ల సమీకృత రైతు బజార్ ప్రారంభోత్సవంకు సిద్ధం చేశామని పేర్కొన్నారు. శాఖల మధ్య సమన్వయ సమస్యలను సత్వర పరిష్కారం అయ్యేలా మంత్రి శ్రీ తారక రామారావు ప్రత్యేక కృషి చేశారని దానివల్లే వేగంగా నిర్మాణం పూర్తి చేయగలిగానని కలెక్టర్ పేర్కొన్నారు. సిరిసిల్ల ర కల పట్టణంలో వేగంగా రైతు బజార్ పూర్తి చేసేందుకు ప్రత్యేక సహకారం అందించిన మంత్రి తారక రామారావు జిల్లా కలెక్టర్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.